Prasanna Vadanam Movie Teaser | సుహాస్ నుంచి మరో మూవీ

Prasanna Vadanam Movie Teaser: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ తర్వాత సుహాస్ నుంచి వస్తున్న సినిమా ప్రసన్నవదనం. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Advertisement
Update: 2024-03-07 17:35 GMT

Prasanna Vadanam Movie Teaser: సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

సుహాస్ తన అమ్మ నాన్నల ఫోటోని గుర్తుపట్టలేడు. ఈ హాస్పిటల్ సీన్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసింది. టీజర్ లో చూపించిన పాత్రల మొహాలపై బ్లర్ ఎఫెక్ట్ తో ప్రజెంట్ చేసి, తర్వాత ఈ కథ వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ని రివిల్ చేశారు.

'ఫేస్ బ్లైండ్ నెస్' నేపధ్యంలో ఈ కథ ఉండబోతుంది. దర్శకుడు కాన్సెప్ట్, క్రైమ్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ ప్లే లో మిక్స్ చేసిన విధానం ఆసక్తికరంగా ఉంది. సుహాస్ గతంలో ఎన్నడూ చేయని ఇంటెన్స్ పాత్రలో కనిపించాడు. తన సహజమైన నటనతో మెస్మరైజ్ చేశాడు.

వైవా హర్ష, నందు, నితిన్, హర్ష వర్ధన్ పాత్రలు కూడా కీలకంగా కనిపించాయి. టీజర్ కి విజయ్ బుల్గానిన్ అందించిన నేపధ్య సంగీతం సస్పెన్స్ ని మరింత ఎలివేట్ చేసింది. ఈ సినిమాతో మరో హిట్ కొడతానంటున్నాడు సుహాస్.


Full View


Tags:    
Advertisement

Similar News