Maama Mascheendra | మామా మశ్చీంద్ర ట్రయిలర్ రివ్యూ

Maama Mascheendra - సుధీర్ బాబు తాజా చిత్రం మామా మశ్చీంద్ర. ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది.

Advertisement
Update: 2023-09-27 17:26 GMT

నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్-ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామ మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ బజ్‌ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు.

పరశురామ్ పాత్ర (సుధీర్ బాబు)ని పరిచయం చేసే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ తో ట్రైలర్ ప్రారంభమైంది. పరశురాంకి మిర్నాళిని రవి, ఈషా రెబ్బా ఇద్దరు కుమార్తెలు. వారు పరశురామ్ సోదరి కొడుకులైన కవలలు డిజే, దుర్గాలతో ప్రేమలో పడతారు. తనపై పగ తీర్చుకునేందుకు డీజే, దుర్గా తన కూతుళ్లతో లవ్ గేమ్ ఆడుతున్నారని పరశురాం అనుమానపడతాడు.

ట్రైలర్‌ సూచించినట్లుగా హర్షవర్ధన్ ఒక యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకు వచ్చాడు. మూడు పాత్రలను విలక్షణంగా చూపించాడు. పరశురామ్ క్రూరమైన నేరస్థుడు. డిజే ప్లేబాయ్. దుర్గ ఒక లావుపాటి వ్యక్తి. ఈ మూడు పాత్రల్లో సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. మిర్నాళిని రవి, ఈషా రెబ్బా గ్లామర్‌గా కనిపించారు. హర్షవర్ధన్ కూడా కీలక పాత్ర పోషించారు.

పీజీ విందా సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్ అసెట్. ఈ చిత్రానికి రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. అక్టోబర్ 6న థియేటర్లలోకి వస్తోంది మామా మశ్చీంద్ర సినిమా.

Full View

Tags:    
Advertisement

Similar News