Waltair Veerayya: వాల్తేరు వీరయ్య టైటిల్ వెనక కథ

Waltair Veerayya: ఈ సినిమా టైటిల్ వెనక గమ్మత్తైన కథ ఉంది. ఆ కథ ఏంటనేది స్వయంగా దర్శకుడు బాబి బయటపెట్టాడు.

Advertisement
Update: 2023-01-08 02:52 GMT

తన అభిమాన హీరో చిరంజీవిని వాల్తేరు వీరయ్య సినిమాతో డైరక్ట్ చేశాడు దర్శకుడు బాబి. ఈ సినిమా టైటిల్ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడా టైటిల్ వెనక కథను బయటపెట్టాడు బాబి. ప్రాస బాగుందని వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టలేదని, వీరయ్య వెనక ఓ చిన్న కథ ఉందని తెలిపాడు.

"వెంకీ మామ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నపుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్ తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్ల లో ఉండేవారు. ఆ టైమ్ లో చిరంజీవి నాన్నగారు సినిమాల కోసం చిరంజీవిపై కొన్ని ఫొటోలు తీయించారు. ఆ పనిని ఓ హెడ్ కానిస్టేబుల్ కు అప్పగించారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఆ ఫోటోల వల్లనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఇది చాలా నోస్టాలిజిక్ గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బావుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్యని లాక్ చేశాం."

ఇలా వాల్తేరు వీరయ్య టైటిల్ వెనక జరిగిన కథను బయటపెట్టాడు బాబి. ఓ అభిమానిగా ఈ సినిమాను తీసినప్పటికీ.. అన్నివర్గాల ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించానని అన్నాడు బాబి.

చిరంజీవి-రవితేజ హీరోలుగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా 13వ తేదీన థియేటర్లలోకి వస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News