Soul Of Satya | మహిళల గొప్పదనంపై సాయితేజ్ షార్ట్ ఫిలిం

Soul Of Satya - సాయిధరమ్ తేజ్ నటించిన సందేశాత్మక లఘు చిత్రం సోల్ ఆఫ్ సత్య. ఇప్పుడీ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైంది.

Advertisement
Update: 2023-08-19 17:24 GMT

సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఒకడు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటాడు. విజయవాడలోని వృద్ధాశ్రమంతో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యతను తను తీసుకున్నాడు.

అలాగే తేజ్ కు మహిళల పట్ల అమితమైన గౌరవం. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష, బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించాడు. ఏ ఫంక్షన్ లో అయినా మహిళల గురించి వారి భద్రత గురించి చాలా గొప్పగా చెప్పే సాయి ధరమ్ తేజ్ కి ఆడవారంటే చాలా గౌరవం. అందుకే ఆడవారు లేకుంటే ప్రపంచం లో ఎవరికి మనుగడ వుండదు అనే విషయాన్ని బలంగా ఈ చిత్రంతో తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యం తో షెడ్యూల్ ఎంత బిజిగా ఉన్నప్పటికీ.. సత్య అనే సినిమాలో నటించాడు.

సీనియర్ నటుడు నరేష్ కుమారుడు హీరో నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించాడు. కలర్స్ స్వాతి ఫిమేల్ లీడ్ గా సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించింది. దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్, హ‌న్షిత దీన్ని నిర్మించారు. రీసెంట్ గా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ స‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసి టీమ్ ను అభినందించారు.

మ‌న కోసం దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌ను అర్పిస్తున్న సైనికుల‌కు, వారి వెనుకున్న ఎందరో త‌ల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళి గా.. మంచి కాన్సెప్ట్ తో ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఇందులో సోల్జర్ గా సాయిధరమ్ తేజ్ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించింది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ ను అంకితం ఇచ్చారు. సింగర్ శృతి రంజని ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాడింది.

Full View

Tags:    
Advertisement

Similar News