Siddhardha - సిద్దార్థ్ నుంచి అరడజను సినిమాలు

Siddhardha - హీరో సిద్దార్థ్ స్పీడ్ పెంచాడు. టక్కర్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ హీరో, త్వరలోనే 6 సినిమాల్ని ప్రకటించబోతున్నాడు.

Advertisement
Update: 2023-06-05 11:16 GMT

Actor Siddharth: మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న సిద్దార్థ్

టక్కర్ సినిమాతో ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాడు సిద్దార్థ్. ఈ మూవీకి సంబంధించి రాత్రి గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు సిద్దార్థ్. తన నుంచి త్వరలోనే 6 సినిమాలు వస్తున్నాయంటూ సంచలన ప్రకటన చేశాడు.

నిజానికి ఇది సంచలన ప్రకటనే. ఎందుకంటే, సిద్దార్థ్ చాలా తక్కువగా సినిమాలు చేస్తుంటాడు. అతడి నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తే అది గొప్ప. అలాంటిది తన నుంచి ఏకంగా అరడజను సినిమాలు వస్తున్నాయని సిద్దార్థ్ ప్రకటించడం విశేషం.

ఈ సందర్భంగా మరో సంచలన ప్రకటన కూడా చేశాడు సిద్దార్థ్. తను వందశాతం తెలుగు బిడ్డనే అంటున్నాడు. తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం బాగా చదివానని, అది తన లోపలకు బాగా వెళ్లిపోయిందని, ఎవరు ఔనన్నా కాదన్నా తను తెలుగు బిడ్డనే అంటూ ప్రకటించుకున్నాడు. గతంలో ఇలాంటి ప్రకటన చేసినందుకే కోలీవుడ్ లో వివాదాస్పదమయ్యాడు సిద్ధూ.

ఇక టక్కర్ విషయానికొస్తే.. సిద్దార్థ్ నుంచి వస్తున్న ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు సిద్దార్థ్.

Tags:    
Advertisement

Similar News