Shiva Karthikeyan | మరో భారీ షెడ్యూల్ మొదలు

Shiva Karthikeyan - మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Advertisement
Update: 2024-03-16 07:28 GMT

శివ కార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టింది. ఈ కీలక షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలని చిత్రికరిస్తున్నారు.

వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందిస్తున్న హీరో శివ కార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ సినిమాగా నిలుస్తుంది. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్ అవతార్ లో కనిపిస్తాడు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

మురుగదాస్ తన స్టయిల్ నుంచి కాస్త పక్కకుజరిగి, ఈ స్టోరీ రాసుకున్నాడు. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు, మంచి పాయింట్ తో ఈ స్టోరీ రాబోతోంది. శివకార్తికేయన్ కంటే, మురుగదాస్ కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం.

మ్యూజిక్ కంపోజర్ రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విభాగాలు చూసుకుంటున్నారు. త్వరలోనే సినిమా నుంచి టీజర్ ను లాంచ్ చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News