Shankar | కూతురు పెళ్లి చేసిన దర్శకుడు శంకర్

Shankar's Daughter - స్టార్ డైరక్టర్ శంకర్, తన పెద్ద కూతురుకి పెళ్లి చేశాడు. చెన్నైలో జరిగిన ఈ పెళ్లికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement
Update: 2024-04-15 17:26 GMT

దర్శకుడు శంకర్ తన పెద్ద కూతురు ఐశ్వర్యకు పెళ్లి చేశాడు. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన తరుణ్ కార్తికేయన్ కు, తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇది ప్రేమ పెళ్లితో పాటు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా.

నిజానికి ఇది రెండో పెళ్లి. ఐశ్వర్యకు ఇదివరకే పెళ్లయింది. క్రికెటర్ రోహిత్ తో 2021లోనే ఐశ్వర్యకు పెళ్లయింది. అయితే పెళ్లయిన 6 నెలలకే లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు రోహిత్.

అప్పట్నుంచి అతడికి దూరంగా తండ్రి దగ్గరే ఉంటోంది ఐశ్వర్య. ఓ ఏడాది కిందట అధికారికంగా కోర్టు ద్వారా విడాకులు కూడా తీసుకుంది. అలా మొదటి పెళ్లికి సంబందించి అన్నీ సెటిల్ చేసిన తర్వాత, కూతురుకు రెండో పెళ్లి చేశాడు శంకర్.

చెన్నైలో ఈ రోజు ఈ పెళ్లి ఘనంగా జరిగింది. స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాహానికి హాజరై, నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. ఇక కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తి, నయనతార, మణిరత్నం.. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ పెళ్లికి తరలివచ్చారు. 

Tags:    
Advertisement

Similar News