Ramabanam - గోపీచంద్ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్

Second Single from Ramabanam released - గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా రామబాణం. ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజైంది.

Advertisement
Update: 2023-04-15 11:02 GMT

మాచో హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా 'రామబాణం'. ఈ సినిమాను టీమ్ జోరుగా ప్రమోట్ చేస్తోంది. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నెలకొల్పింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కర్నూల్‌లో జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్‌ దరువెయ్యరా పాటను విడుదల చేశారు.

మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్‌ని స్కోర్ చేశాడు. దరువెయ్యరా పాట భక్తిరసంతో ఉంటూనే, ఫెస్టివల్ లుక్ ను తీసుకొచ్చింది. ఈ పాటను దేవాలయం బ్యాగ్ డ్రాప్ లో చిత్రీకరించారు. కుటుంబ సమేతంగా యజ్ఞం చేయడం కనిపించింది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.

ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. కృష్ణ తేజస్వి, చైత్ర ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. మే 5న రామబాణం సినిమా థియేటర్లలోకి వస్తుంది.


Full View


Tags:    
Advertisement

Similar News