Weapon Movie | సూపర్ హీరో పాత్రలో సత్యరాజ్

SatyaRaj Weapon Movie - సత్యరాజ్ లీడ్ రోల్ లో వెపన్ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో ఆయన సూపర్ హీరోగా కనిపించనున్నారు.

Advertisement
Update: 2023-08-22 03:15 GMT

మిర్చి, బాహుబలి, ప్రతి రోజూ పండగే సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యరాజ్. ఇప్పుడీ సీనియర్ నటుడు ప్రధాన పాత్రలో మరో డిఫరెంట్ మూవీ వస్తోంది. ఆ సినిమా పేరు వెపన్. వసంత్ రవి ప్రధాన పాత్రధారి.

సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తోంది 'వెపన్'. మిలియన్ స్టూడియో బ్యానర్ పై గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా విడుదల చేశారు. టీజర్ ను గమనిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ లో సత్యరాజ్, వసంత్ రవి పాత్రలను నెక్ట్స్ రేంజ్ లో రూపొందించినట్లు స్పష్టమవుతుంది.

సత్యరాజ్, వసంత్ రవిలపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. టీజర్ చూస్తే, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీసినట్టు తెలుస్తోంది. ఇందులో సూపర్ మేన్ రోల్ లో కనిపించబోతున్నారు సత్యరాజ్. అతడ్ని చంపడం అసాధ్యం అనే డైలాగ్ కూడా సినిమాలో ఉంది.

సూపర్ హ్యూమన్ గురించి అన్వేషణ జరుగుతుంటుంది. అసలా సూపర్ హ్యుమన్ ఎవరు? అనే కోణంలో సినిమా సాగుతుంది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు మంచి ఫీల్ తీసుకొచ్చింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Full View

Tags:    
Advertisement

Similar News