Zebra Movie | సత్యదేవ్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Zebra Movie - సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జీబ్రీ. ఈ సినిమా డబ్బింగ్ స్టేజ్ లోకి ఎంటరైంది.

Advertisement
Update: 2023-08-31 14:42 GMT

హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జీబ్రా. ధైర్యంగా ఉండేవాళ్లనే అదృష్టం వరిస్తుందనే అర్థం వచ్చేలా ట్యాగ్ లైన్ పెట్టారు.

పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిసినాటో హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా హీరో సత్యదేవ్ 'జీబ్రా' డబ్బింగ్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా స్టూడియో నుంచి డబ్బింగ్ చెబుతున్న ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. కనీవినీ ఎరుగని ఆర్ధికనేరాల నేపధ్యంలో యధార్ధ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ సంగీతం ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.

రీసెంట్ గా థియేటర్లలో సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు సత్యదేవ్. తమన్నతో కలిసి అతడు నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత, ఆ సినిమాకు ముందు చేసిన మూవీస్ కూడా క్లిక్ అవ్వలేదు. దీంతో జీబ్రాపైనే హోప్స్ పెట్టుకున్నాడు ఈ హీరో. 

Tags:    
Advertisement

Similar News