Krishnamma | సత్యదేవ్ సినిమా వస్తోంది

Krishnamma Movie - సత్యదేవ్ తాజా చిత్రం కృష్ణమ్మ. చాన్నాళ్ల కిందటే రెడీ అయిన ఈ సినిమాను ఇన్నాళ్లకు థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Advertisement
Update: 2024-04-06 09:42 GMT

టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్‌ చేసుకుంటున్నాడు ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది.

వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. స్టార్ డైరక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చారు.

నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ ''రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. టైటిల్‌ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్‌ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు." అని అన్నారు.

కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

Tags:    
Advertisement

Similar News