Double Ismart | రామ్ కు విలన్ సెట్ అయ్యాడు

Sanjay Dutt Double Ismart - డబుల్ ఇస్మార్ట్ నుంచి మరో ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈసారి సంజయ్ దత్ వంతు.

Advertisement
Update: 2023-07-29 13:50 GMT

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌’. వారి గత బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ గా రూపొందుతోంది ఈ సినిమా.

ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో మొదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తీశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ గా మేకోవర్‌ అయ్యాడు.

ఈ రోజు ఒక బిగ్ అప్‌డేట్‌తో వచ్చారు డబుల్ ఇస్మార్ట్ మేకర్స్. బాలీవుడ్‌ సీనియర్ సంజయ్‌దత్‌, డబుల్‌ ఇస్మార్ట్‌లో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ఆయన ఆల్రెడీ షూట్‌లో జాయిన్ అయ్యాడు. ఈరోజు, సంజయ్ దత్ పాత్రను బిగ్ బుల్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు సంజయ్ దత్. పోస్టర్‌లో సంజయ్ దత్ సిగార్ తాగుతున్నట్లు కనిపించాడు. గన్స్ అతని వైపు గురిపెట్టినట్లు కనిపిస్తున్నాయి. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడనే విషయం పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

రామ్, సంజయ్ దత్‌ కాంబో డిఫరెంట్ గా ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 8న 'డబుల్ ఇస్మార్ట్‌' థియేటర్లలోకి వస్తోంది.




Tags:    
Advertisement

Similar News