Samantha | ట్రీట్ మెంట్ కోసం అమెరికాకు సమంత

Samantha Treatment - శారీరకంగా పూర్తిస్థాయిలో కోలుకునేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది సమంత. ఇందులో భాగంగా ఆమెరికా వెళ్లింది.

Advertisement
Update: 2023-08-19 17:29 GMT

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత 

ఎట్టకేలకు సమంత అమెరికాలో ల్యాండ్ అయింది. తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లింది. అమెరికాలో ఆమె ట్రీట్ మెంట్ తీసుకోబోతోంది. కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఆమె సక్సెస్ ఫుల్ గా బయటపడింది. కాకపోతే దాని సైడ్ ఎఫెక్టులు మాత్రం అలానే ఉండిపోయాయి

ఉదాహరణకు కళ్లపై లైట్ పడితే సమంత తట్టుకోలేదు. ఆమె కళ్లు నొప్పి పెడతాయి, ఆ వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది. ఇక నిద్ర నుంచి లేచి వెంటనే ఆమె శరీరంలో కొన్ని భాగాలు నొప్పికి గురవుతున్నాయి. వీటితో పాటు మరిన్ని సైడ్ ఎఫెక్టులు ఆమె ఫేస్ చేస్తోంది.

వీటికి శాశ్వత పరిష్కారం పొందేందుకు అమెరికా వెళ్లింది సమంత. రేపు న్యూయార్క్ లో జరగనున్న ఇండియా డే పరేడ్ లో ఆమె పాల్గొంటుంది. ఆ వెంటనే ట్రీట్ మెంట్ మొదలవుతుంది. ఈ చికిత్స ఎన్ని వారాలు ఉంటుంది, ఆమె ఎక్కడ ట్రీట్ మెంట్ తీసుకోబోతోంది లాంటి వివరాల్ని మాత్రం సమంత వెల్లడించలేదు.

Tags:    
Advertisement

Similar News