Samantha | నిర్మాణ సంస్థ స్థాపించిన సమంత

Samantha - హీరోయిన్ సమంత, సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసింది. ఆమె ప్రొడక్షన్ హౌజ్ పేరేంటో తెలుసా?

Advertisement
Update: 2023-12-10 16:04 GMT

హీరోయిన్ సమంత, స్వీట్ షాక్ ఇచ్చింది. ఆమె నిర్మాతగా మారింది, ఓ కొత్త బ్యానర్ స్థాపించింది. తన నిర్మాణ సంస్థ వివరాలు, ఆశయాలు వెల్లడించింది.

సమంత కొత్త బ్యానర్ పేరు ట్రాలాల. ఓ పాత పాప్ ఆల్బమ్ ఆధారంగా తన బ్యానర్ కు ఈ పేరు పెట్టింది సమంత. చిన్నప్పట్నుంచి ఆ పాట విని పెరిగానని, అందుకే ఆ పాటపై మమకారంతో, ఆ పాట స్ఫూర్తితో తన బ్యానర్ కు ట్రాలాల అనే పేరు పెట్టానని వెల్లడించింది సమంత.

ఇక తన బ్యానర్ పై విశ్వవ్యాప్తమైన, సార్వజనీయమైన కథలను నిర్మిస్తానని ఆమె ప్రకటించింది. నేటి తరం ఆలోచనల్ని ప్రతిబింబించేలా, సమాజంలో ఉన్న సంక్లిష్టతలను బయటపెట్టేలా తన బ్యానర్ పై సినిమాలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఔత్సాహిక మేకర్స్ కు స్వాగతం పలికింది సమంత.

మయొసైటిస్ బారిన పడిన సమంత, ఆ వ్యాధి నుంచి పూర్తిస్థాయిలో కోలుకునేందుకు కెరీర్ లో గ్యాప్ తీసుకుంది. ఆమె తిరిగి ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్న టైమ్ లో, ఇలా కొత్త బ్యానర్ ప్రకటించింది, తన ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది ఈ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News