Sai Tej - యూత్ కు సాయిధరమ్ తేజ్ సందేశం

Sai Dharam Tej - యువతరానికి ప్రత్యేకంగా సందేశం అందించాడు సాయిధరమ్ తేజ్.

Advertisement
Update: 2023-04-17 02:44 GMT

అమ్మాయిలపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సాయిధరమ్ తేజ్. ఓసారి బ్రేకప్ అయిందని, ప్రస్తుతం అమ్మాయిలంటేనే భయం వేస్తోందని ప్రకటించాడు. తాజాగా అమ్మాయిలు-అబ్బాయిలు అందరికీ సందేశం ఇచ్చాడు.

"మీ అమ్మ, నాన్న, గురువులు గర్వపడేలా చేయాలి. మేలుకో, లేచి నిలబడు.. అమ్మానాన్నలు, గురువులు గర్వపడేలా చేయండి. మీరంతా కూడా కష్టపడి గొప్పవాళ్లు అవ్వాలి. నాకు అప్పుడే ఆనందంగా ఉంటుంది. బైక్ నడుపుతూ ఉంటే.. అందరూ హెల్మెట్‌ను వాడండి. అబ్బాయిలంతా కలిసి.. అమ్మాయిలకు మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం. మీరు ప్రేమించే అమ్మాయిని కాకుండా మిగతా అందరిలోనూ అమ్మను చూడండి. అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు క్షమించండి."

ఇలా అమ్మాయిలు-అబ్బాయిలకు కామన్ గా ఓ సందేశం ఇచ్చాడు సాయితేజ్. విరూపాక్ష సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో తన యాక్సిడెంట్ మేటర్ ను బయటపెట్టాడు సాయితేజ్. యాక్సిడెంట్ తర్వాత తన మానసిక సంఘర్షణను ఆవిష్కరించాడు.

ఇవన్నీ సింపతీ కోసం చెప్పడం లేదని, నేటి యూత్ తన నుంచి ఏదైనా కొంత నేర్చుకుంటే తనకు చాలని చెబుతున్నాడు ఈ హీరో. కార్తీక్ దండు డైరక్ట్ చేసిన విరూపాక్ష సినిమా, ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది.

Tags:    
Advertisement

Similar News