Sai Dharam Tej as Mark - బ్రో మూవీ నుంచి సాయితేజ్ ఫస్ట్ లుక్

Sai Dharam Tej as Mark - బ్రో మూవీ నుంచి సాయిధరమ్ తేజ్ లుక్ రిలీజ్ చేశారు. అతడి క్యారెక్టర్ పేరు మార్క్.

Advertisement
Update: 2023-05-24 05:38 GMT

మేనమామ-మేనల్లుడు ద్వయం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

'బ్రో' చిత్రంలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనిపించనున్నాడు సాయి తేజ్. తెల్ల దుస్తులు ధరించి ఫస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయి తేజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో "బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.." అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ పాత్రను పరిచయం చేయడం బాగుంది

మే 18న 'బ్రో' టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు అదే ఊపులో సాయితేజ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

'బ్రో' సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూట్ నడుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. 

Tags:    
Advertisement

Similar News