Rudrangi - రుద్రంగి రిలీజ్ డేట్ ఫిక్స్

Rudrangi Movie Release date - రుద్రంగి మూవీకి విడుదల తేదీ ఖరారైంది. తెలంగాణ ఎమ్మెల్యే నిర్మిస్తున్న ఈ సినిమా విశేషాలు మీకోసం..

Advertisement
Update: 2023-06-22 12:26 GMT

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రుద్రంగి'. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జూలై 7న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే అన్ని పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్. పాటలు, టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందీ సినిమా. ఒకప్పటి తెలంగాణ సామాజిక పరిస్థితులను నేపథ్యంగా ఎంచుకుని పీరియాడిక్ మూవీగా 'రుద్రంగి' రూపొందింది. నాటి తెలంగాణాలో దొరల ఆగడాలు ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికర కథా కథనాలతో సినిమా ఆకట్టుకోబోతోంది.

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహన్ దాస్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇందులో హీరోహీరోయిన్లు ఉండరు. అన్నీ పాత్రలే కనిపిస్తాయి, ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.

ఈ పీరియాడిక్ సినిమా కోసం కొన్ని సెట్స్ కూడా వేశారు. సంతోష్ సినిమాటోగ్రఫీ, నాఫల్ రాజా సంగీతం హైలెట్స్ గా నిలుస్తాయని చెబుతున్నాడు దర్శకుడు అజయ్. ఇక నటీనటుల విషయానికొస్తే.. జగపతిబాబు పెర్ఫార్మెన్స్ టోటల్ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News