Eagle Trailer | రవితేజ ఈగల్ ట్రయిలర్ రిలీజ్

Eagle Move - రవితేజ తాజా చిత్రం ఈగల్. ఈ సినిమా ట్రయిలర్ ను తాజాగా విడుదల చేశారు.

Advertisement
Update: 2023-12-20 15:37 GMT

రవితేజ తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ఈ సినిమా టీజర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు లాంచ్ చేశారు.

పోలీసులు, గ్యాంగ్‌స్టర్లు, నక్సలైట్లకు కూడా మోస్ట్ వాంటెడ్ అయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్న అనుపమ పరమేశ్వరన్, నవదీప్ తో సీరియస్ గా మాట్లాడుతున్న సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. “తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా... అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు...” అని నవదీప్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని మరింతగా పెంచింది.

అతను ఒక మిషన్‌లో ఉన్న క్రూరమైన హంతకుడు. అతను టర్కీ, జర్మనీ, జపాన్‌లో లావాదేవీలు జరిపిన వ్యక్తి. అతను దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాడు. అతని కథ గత 10 సంవత్సరాలలో బిగ్గెస్ట్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. ఇదంతా రెండు విభిన్నమైన గెటప్‌లలో కనిపించిన హీరో రవితేజ గురించి.

'ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు... ఆయుధంతో విధ్వంసం ఆపే వాడు దేవుడు... ఈ దేవుడు మంచోడు కాదు... మొండోడు ’’ అంటూ ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. కార్తికేయ2 చిత్రానికి రాసిన మణిబాబు కరణం ఈ సినిమాకు మంచి డైలాగ్స్ రాశాడు. ట్రయిలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈగల్, సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News