Raviteja | ఈగల్ సాంగ్స్ పై రవితేజ రియాక్షన్ ఇది

Raviteja - ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో సాంగ్స్ పై ప్రత్యేకంగా స్పందించాడు.

Advertisement
Update: 2024-01-28 16:18 GMT

ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కింది. ఊరు పేరు భైరవకోన సినిమా వాయిదా పడింది. అలా 9వ తేదీన సోలోగా వస్తున్న ఈగల్ సినిమాకు సంబంధించి ప్రచారం మొదలుపెట్టాడు హీరో రవితేజ. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కథను చెబుతాయంటున్నాడు.

"ఈగల్ సినిమాలో మాస్ సాంగ్ ఉంది, మెలొడీ సాంగ్ ఉంది, 2 బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా సినిమాలో 5 పాటలున్నాయి. అయితే ఏ పాట కావాలని పెట్టినట్టు ఉండదు. పైగా హీరోయిన్ల కోసమో, హీరో కోసమో పెట్టిన సాంగ్ లేదు. ఈగల్ సినిమాలో ప్రతి పాట కథ చెబుతుంది. ప్రతి సాంగ్ కథలో భాగమే. పాటలో కూడా కథ నడుస్తుంటుంది."

ఈగల్ సినిమాను అంతా సీరియస్ మూవీ అనుకుంటున్నారు. అయితే ఇందులో కామెడీ కూడా ఉందంటున్నాడు రవితేజ. దాని కోసం ప్రత్యేకంగా కమెడియన్లు అంటూ ఎవ్వరూ ఉండరని, తన పాత్ర చుట్టూనే ఓ డార్క్ కామెడీ రన్ అవుతుందని చెప్పుకొచ్చాడు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. 

Tags:    
Advertisement

Similar News