Ravi Teja: చాన్నాళ్ల తర్వాత రవితేజకు హిట్

Ravi Teja's Dhamaka Movie: ధమాకా మూవీతో విడుదలకు ముందే ఓ సక్సెస్ అందుకున్నాడు రవితేజ. ఈ సినిమా నుంచి రిలీజైన జింతాక సాంగ్ పెద్ద హిట్టయింది.

Advertisement
Update: 2022-10-30 11:21 GMT

క్రాక్ తర్వాత మళ్లీ వరుసగా ఫ్లాపులే ఇస్తున్నాడు రవితేజ. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇలాంటి టైమ్ లో అనుకోని హిట్ కొట్టాడు రవితేజ. అదేంటి, రవితేజ నుంచి సినిమా రాకుండానే హిట్ ఎలా అయిందని అనుకుంటున్నారా? ఇది సినిమాకు సంబంధించిన మేటర్ కాదు, సినిమా పాటకు సంబంధించిన విషయం.

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబోలో వస్తోంది ధమాకా సినిమా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని జింతాక్ పాట మాస్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది.

తాజాగా జింతాక్ పాట 26 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ సాంగ్ గా అలరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు మాస్ ట్యూన్ అందించగా.. కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చాడు. మంగ్లీ ఈ పాట పాడారు.

పాటలో రవితేజ మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి. రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఇటివలే చిత్ర యూనిట్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ 'ధమాకా' చిత్రం విడుదల తేదిని ప్రకటించింది. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News