Rashmika | మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన రష్మిక

Rashmika Sekhar Kammula - ధనుష్ సరసన హీరోయిన్ గా నటించనుంది రష్మిక. ఇది శేఖర్ కమ్ముల సినిమా.

Advertisement
Update: 2023-08-15 03:33 GMT

కెరీర్ స్టార్టింగ్ నుంచి అదృష్టాన్ని బ్యాగులో పెట్టుకొని తిరుగుతోంది రష్మిక. భారీ ప్రాజెక్టులన్నీ ఈమెనే వరిస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమా చేస్తోంది. ఇటు సౌత్ లో అల్లు అర్జున్ సరసన పుష్ప-2 సినిమా చేస్తోంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు దక్కించుకుంది రష్మిక.

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చాన్నాళ్ల కిందటే ఓ కొత్త సినిమా ప్రకటించింది ఏషియన్ మూవీస్ సంస్థ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఇందులో భాగంగా ధనుష్ సరసన హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసింది యూనిట్.

ధనుష్-రష్మికది ఫ్రెష్ కాంబినేషన్. కచ్చితంగా ఈ జోడీ, సిల్వర్ స్క్రీన్ పై మేజిక్ చేస్తుంది. ఎందుకంటే, ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్. వీటన్నింటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా అవ్వడం, మరింత ప్రత్యేకత సంతరించుకుంది.

కమ్ముల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఎంత వెయిట్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో మంచి పాత్రలు దక్కించుకుంది సాయిపల్లవి. ఆ క్యారెక్టర్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రష్మిక పాత్ర ఉండబోతోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ రాబోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News