Rashmika | అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక

Rashmika - హీరోయిన్ రష్మిక అరుదైన రికార్డ్ సృష్టించింది. వరుసపెట్టి 3 పరిశ్రమల్లో 3 హిట్స్ కొట్టింది. తెలుగు, తమిళ్, హిందీలో ఆమె బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించింది.

Advertisement
Update: 2023-12-11 16:23 GMT

నేషనల్ క్రష్ అని ముద్దుగా పిలుచుకునే రష్మిక తెలుగులోనే కాదు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలలో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమెకు ఎప్పట్నుంచో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆమె రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్‌లో నటించిన విషయం తెలిసిందే, ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

యానిమల్ బ్లాక్ బస్టర్ విజయంతో, రష్మిక మందన్న అన్ని ఇండస్ట్రీల్లో బ్లాక్ బస్టర్స్ సాధించినట్టయింది. ఆమె కిరిక్ పార్టీతో కన్నడ పరిశ్రమలో నటిగా అరంగేట్రం చేసింది, అది అక్కడ భారీ బ్లాక్ బస్టర్.

ఛలో వంటి బ్లాక్‌బస్టర్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, తెలుగులో వరుసగా విజయాలు అందుకుంది. పుష్ప, సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత విజయ్ నటించిన వారిసు చిత్రంతో కోలీవుడ్‌లో కూడా బ్లాక్ బస్టర్ సాధించింది.

ఇప్పుడు యానిమల్‌తో ఆమె బాలీవుడ్‌లో కూడా భారీ బ్లాక్‌బస్టర్‌ అందుకుంది. ఇలా రెండేళ్లలో అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకొని తనకుతానే సాటి అని నిరూపించుకుంది రష్మిక. ప్రస్తుతం ఈమె పుష్ప-2, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News