Animal Movie | వాయిదా పడిన యానిమల్ విడుదల

Ranbir Kapoor's Animal Movie - లెక్కప్రకారం ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాలి యానిమల్. కానీ వాయిదా పడింది.

Advertisement
Update: 2023-07-04 02:30 GMT

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యాక్షన్-థ్రిల్లర్ 'యానిమల్'. ఈ సినిమా ప్రీ-టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. యానిమల్‌ని థియేటర్లలో చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల వాయిదా పడింది. మొదట ఆగస్ట్ 11న విడుదల కావాల్సిన యానిమల్ డిసెంబర్ 1కి వాయిదా పడింది.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ మేరకు వీడియో విడుదల చేశాడు, వాయిదాకు కారణాన్ని చెప్పాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అధికంగా ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని వివరించాడు. సినిమాలో 7 పాటలు ఉన్నాయని, ఒక్కో పాటను ఐదు భాషల్లో పర్ఫెక్ట్ లిరిక్స్‌తో రికార్డ్ చేయడం బిగ్ టాస్క్ అన్నాడు. ప్రీ టీజర్‌లోని సీక్వెన్స్ సినిమాలో ఉందని కూడా స్పష్టం చేశాడు.

టీ-సిరీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

హిందీలో తీసిన కబీర్ సింగ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఎట్టకేలకు అతడు యానిమల్ షూటింగ్ పూర్తిచేశాడు. అయితే టైమ్ లేకపోవడంతో పోస్ట్ పోన్ తప్పలేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తాడు ఈ దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News