Rana Dulquer Salman | రానా, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్

Rana Dulquer Salman Movie - ఇద్దరు విలక్షణ నటులు చేతులు కలిపారు. వాళ్లే రానా, దుల్కర్ సల్మాన్. వీళ్లిద్దరూ కలిసి చేయబోయే సినిమా పేరు కాంత.

Advertisement
Update: 2023-07-29 13:37 GMT

టాలీవుడ్ హీరో రానా, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ చిత్రం కోసం చేతులుకలిపారు. రానా తాజాగా స్థాపించిన స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మల్టీ లింగ్వల్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.

ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'కాంత' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నాడు.

ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్న రానా.. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని గట్టిగా చెబుతున్నాడు.

“చాలా అరుదుగా సినిమా పవర్ గుర్తు చేసే కథలు మనకు కనిపిస్తాయి. కాంత కూడా అలాంటిదే. టాలీవుడ్, మల్లూవుడ్ ను కలిపింది కాంత. సూపర్ టాలెంటెడ్ దుల్కర్ సల్మాన్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. కాంత ప్రపంచంలోకి దుల్కర్ ను ఆహ్వానిస్తున్నాను.”

ఇలా కాంత సినిమాను గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు రానా. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టీం వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.




Tags:    
Advertisement

Similar News