Ramcharan - సరికొత్త రికార్డ్ సృష్టించిన చరణ్

Ramcharan record in Hollywood - హాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు రామ్ చరణ్. ఇప్పటివరకు ఏ భారతీయ హీరోకు సాధ్యంకాని రికార్డ్ ఇది.

Advertisement
Update: 2023-02-26 15:28 GMT

రామ్ చరణ్ అమెరికా వెళ్ళి 5 రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నాడు. వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అమెరికాలోని ఓ ఆలయంలో అయ్యప్ప మాల తీసిన తర్వాత 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నాడు. 'ఏబీసీ న్యూస్'కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అభిమానులతో ముచ్చటించాడు. 'ఆర్ఆర్ఆర్', 'నాటు నాటు' సాంగ్, ఎస్.ఎస్. రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు. క్రాస్ ఓవర్ మూవీస్ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేశాడు.

బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నాడు. హెచ్‌సీఏ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్'కు 4 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నాడు.

హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా 'బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్'ను రామ్ చరణ్ అనౌన్స్ చేశాడు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆయన పక్కన నిలబడటమే అవార్డ్ అని నటి ఏంజెలా చెప్పారు. హాలీవుడ్ సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ నిలిచాడు.

'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన రామ్ చరణ్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారతీయతను ప్రతిబింబిస్తున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్ గా పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ అనే పదానికి నిజమైన అర్థం ఏంటనేది చేతల్లో చూపిస్తున్నారు చరణ్.

Tags:    
Advertisement

Similar News