Skanda Movie | రామ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Skanda Movie - రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా స్కంద. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం.

Advertisement
Update: 2023-08-10 15:39 GMT

‘అఖండ’ బ్లాక్‌బస్టర్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా స్కంద. రామ్ పోతినేని హీరోగా వస్తోంది ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్స్ లో చూపించడం బోయపాటికి ఇష్టం. స్కందలో రామ్ ను కూడా అలానే డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ మెటిరియల్ లో రామ్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు.

ఇదిలాఉండగా, ఓ భారీ సెట్‌లో లీడ్ పెయిర్, డ్యాన్సర్‌లపై స్కంద సినిమాకు సంబంధించి చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఫోటోలో రామ్, శ్రీలీల.. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి కనిపించారు.

ఇప్పుడు మేకర్స్‌కి సినిమా ప్రమోషన్‌ కు సమయం దొరికినట్టయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా దీన్ని జోరుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు.

టీజర్, టైటిల్ గ్లింప్స్‌ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజైన సింగిల్ కూడా ఆకట్టుకుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పాటలో రామ్, శ్రీలీల డాన్స్ ఆకట్టుకుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

Tags:    
Advertisement

Similar News