Ram Pothineni - ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్

Ram Pothineni and Puri Jagannadh - ఇస్మార్ట్ జోడీ మళ్లీ కలిసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

Advertisement
Update: 2023-05-11 12:04 GMT

ఇస్మార్ట్ శంకర్.. పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా తర్వాత ఇటు రామ్ పోతినేనికి, అటు పూరి జగన్నాధ్ కు ఇద్దరికీ సక్సెస్ లేదు. వరుసపెట్టి ఫ్లాపులిచ్చారు. అలా ఎవరి ఫ్లాపులతో వాళ్లు ఇబ్బంది పడుతున్న టైమ్ ఇది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ కలిసింది.

ఇస్మార్ట శంకర్ మేజిక్ ను రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు రామ్-పూరి. ఇది అచ్చంగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనే టాక్ నడుస్తోంది. సినిమాకు టైటిల్ కూడా సీక్వెల్ అర్థం వచ్చేలా పెడతారంట. 15న రామ్ పుట్టినరోజు. ఆ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి.

పూరి జగన్నాధ్ తో వ్యవహారం మామూలుగా ఉండదు. ఇలా సినిమా మొదలైందనుకునేలోపే, పూర్తయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది మేకింగ్. అందుకే పూరి కోసం తన కమిట్ మెంట్ సైతం పక్కనపెట్టాడు రామ్.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాల్సి ఉంది. పూరి జగన్నాధ్ చెప్పిన కథ నచ్చడంతో, అంగీకరించిన ప్రాజెక్ట్ పక్కనపెట్టి మరీ పూరీకి కాల్షీట్లు ఇచ్చాడు రామ్. లైగర్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన పూరి జగన్నాధ్... ఇస్మార్ట్ శంకర్-2తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News