Ram Boyapati - కొత్త విడుదల తేదీ ప్రకటించిన రామ్

Ram Boyapati Movie - రామ్, బోయపాటి కొత్త సినిమాకు, కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2023-06-23 13:23 GMT

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయాలని మొదట భావించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నిజానికి దసరా కంటే ముందు పంద్రాగస్టుకు ఈ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ చిరు నటిస్తున్న భోళాశంకర్ షెడ్యూల్ అయింది. దీంతో ఇటు ఆగస్ట్ 15 కాకుండా, అటు దసరా కాకుండా.. మధ్యలో సెప్టెంబర్ 15 ఫిక్స్ చేశారు. తాజాగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ వైట్ అండ్ వైట్‌ లో సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తున్నాడు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి, పొలంలో కాఫీని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. ఈ చిత్రంలో రామ్ గుబురు గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. రామ్ ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నాడు బోయపాటి.

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News