Skanda | రామ్ సినిమా టైటిల్ ఇదే

Skanda Movie - రామ్, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు ఎట్టకేలకు టైటిల్ ఫిక్స్ చేశారు.

Advertisement
Update: 2023-07-03 12:33 GMT

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ సినిమాకు పేరు పెట్టారు. కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి మరొక పేరు అయిన 'స్కంద'ని టైటిల్‌ గా లాక్ చేశారు మేకర్స్. ది ఎటాకర్ అనే ట్యాగ్ లైన్ హీరో ఫెరోషియస్ స్వభావాన్ని సూచిస్తోంది. కార్తికేయస్వామి ఆయుధం శూలం టైటిల్ లోగోలో ఉంది.

టైటిల్ గ్లింప్ల్స్ లో రామ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. గుడిలోని చెరువులో గూండాలపై ఫైట్ చేస్తూ, వాళ్లను సంహరించే సుబ్రమణ్య స్వామిగా కనిపించాడు. "మీరు దిగితే ఊడేదుండదు... నేను దిగితే మిగిలేదుండదు'' అనే పవర్ ఫుల్ డైలాగ్‌ గ్లింప్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

స్టన్ శివ కొరియోగ్రఫీలో ఈ ఫైట్ సీక్వెన్స్‌ తెరకెక్కగా.. తమన్ మంచి నేపధ్య సంగీతం అందించాడు. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల, స్కంద సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు.

'స్కంద' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా ఇదే.


Full View


Tags:    
Advertisement

Similar News