Rakul Preeth | పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Marriage - హీరోయిన్ రకుల్ పెళ్లి చేసుకుంది. గోవాలో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక.

Advertisement
Update: 2024-02-21 17:38 GMT

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది. ఈరోజు గోవాలో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ ఫైవ్ స్టార్ రిసార్ట్ హోటల్ లో రకుల్-జాకీ పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీళ్ల వివాహం జరిగింది.

సిక్కు కుటుంబానికి చెందిన వ్యక్తి రుకుల్ ప్రీత్ సింగ్. ఇక జాకీ భగ్నానీ సింధ్ వంశానికి చెందిన వ్యక్తి. అందుకే రెండు సంప్రదాయాల్లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ముందుగా సిక్కు సంప్రదాయంలో, ఆ తర్వాత సింధ్ పద్ధతిలో వీళ్లు వివాహం చేసుకున్నారు.

3 రోజుల పాటు వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది. సంగీత్ రోజున రకుల్ కోసం ప్రత్యేకంగా డాన్స్ చేసింది శిల్పాషెట్టి, అటు హీరో వరుణ్ ధావన్ కూడా రకుల్ పెళ్లిలో డాన్స్ చేశాడు. సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు రకుల్-జాకీ. కరోనా టైమ్ లో తమ ప్రేమ విషయాన్ని బాహ్య ప్రపంచానికి వెళ్లడించారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. 










Tags:    
Advertisement

Similar News