Jailer - జైలర్ ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్

Rajinikanth's Jailer - జైలర్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. అప్పుడే సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Advertisement
Update: 2023-07-08 04:21 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.

ప్రచారంలో భాగంగా ఇప్పటికే జైలర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జైలర్ నుంచి మొదటి లిరికల్ వీడియోను విడుదల చేశారు. రజనీకాంత్-తమన్నపై పిక్చరైజ్ చేసిన రొమాంటిక్ సాంగ్ ఇది. అనిరుధ్ ఈ పాటను కంపోజ్ చేశాడు.

లిరికల్ వీడియో రిలీజైన వెంటనే సూపర్ హిట్టయింది. మరీ ముఖ్యంగా అందులో రజనీకాంత్ స్టయిల్, తమన్న స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. భారీ వ్యూస్ తో ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ పాట సక్సెస్ తో జైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి.

మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, సునీల్, రమ్యకృష్ణ, యోగి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 


Full View


Tags:    
Advertisement

Similar News