Jailer | మరో రికార్డు సృష్టించిన రజనీకాంత్

Rajinikanth's Jailer Movie - జైలర్ మూవీ మరో రికార్డ్ సృష్టించింది. అత్యంత వేగంగా 500 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా రికార్డ్ సృష్టించింది.

Advertisement
Update: 2023-08-20 16:12 GMT

Jailer Movie Review | జైలర్ మూవీ రివ్యూ {3/5}

విడుదలైన 10 రోజులకే, రజనీకాంత్ యాక్షన్ చిత్రం "జైలర్" ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆగస్ట్ 10న రిలీజైన జైలర్ సినిమా, అన్ని భాషల్లో 48.35 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించి బలమైన ఓపెనింగ్స్ సాధించింది. కేవలం భారతదేశంలోనే ఈ సినిమా వసూళ్లు.. 263.9 కోట్ల రూపాయల నెట్ దాటింది.

శుక్రవారం రూ.10.05 కోట్లు కలెక్ట్ చేసిన జైలర్ సినిమా, శనివారం బాక్సాఫీస్ వద్ద గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఏకంగా 18 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అలా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లోకి చేరింది.

రజనీకాంత్ హీరోగా నటించిన "జైలర్", 500 కోట్ల రూపాయల మార్కును దాటిన మూడవ తమిళ చిత్రం. అత్యంత వేగంగా 500 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా 2.O నిలవగా.. రెండో స్థానంలో జైలర్ నిలిచింది. ఈ క్లబ్ లో పొన్నియన్ సెల్వన్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, బాహుబలి-2, బాహుబలి-1 చిత్రాలున్నాయి.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన సినిమా "జైలర్". సినిమాలో రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా.. వసంత్ రవి, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. అదనంగా ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ కూడా కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News