Raja The Great | రవితేజ సినిమాకు సీక్వెల్?

Raja The Great - రవితేజ కెరీర్ లో సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది రాజా ది గ్రేట్. ఇప్పుడీ సినిమా సీక్వెల్ పై జోరుగా చర్చ సాగుతోంది.

Advertisement
Update: 2023-11-13 16:02 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న కొత్త రూమర్ ఇదే. అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్ ట్రెండ్ పెరిగింది. అందుకే భారీ బడ్జెట్ సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు వాటికి సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో రవితేజ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్ రాజా ది గ్రేట్ సీక్వెల్ కూడా వస్తుందనే ప్రచారం మొదలైంది.

2017లో రాజా ది గ్రేట్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోను అంధుడిగా చూపించి మరీ హిట్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు బజ్ నడుస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

అధికారిక ప్రకటన లేకపోయినా, అనిల్ రావిపూడి – రవితేజ – దిల్ రాజు కాంబినేషన్ రిపీట్ అవుతుందని గట్టిగా టాక్ నడుస్తోంది. భగవంత్ కేసరి తర్వాత అనీల్ రావిపూడి ప్రాజెక్టు ఇదే అనే టాక్ వినిపిస్తోంది. అనీల్ రావిపూడి దగ్గర రాజా ది గ్రేట్ సీక్వెల్ కు లైన్ సిద్ధంగా ఉంది. కాకపోతే దానిమీద పూర్తిస్థాయిలో కసరత్తు మొదలుపెట్టలేదు. ఈ విషయాన్ని ఆయన గతంలో స్వయంగా ప్రకటించాడు కూడా.

ఎటొచ్చి అనీల్ రావిపూడి ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. ఓ పెద్ద హీరోతో నెక్ట్స్ మూవీ సెట్ చేయాలని చూస్తున్నాడు. చరణ్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోలంతా బిజీగా ఉన్నారు. వాళ్లలో ఎవ్వరూ దొరక్కపోతే, అప్పుడికి రవితేజతో రాజా ది గ్రేట్ సీక్వెల్ మొదలుపెడతాడు.

Tags:    
Advertisement

Similar News