Rudrudu Movie - రుద్రుడు స్టోరీ చెప్పేసిన లారెన్స్

Raghava Lawrence reveals Rudrudu movie storyline - రేపు రిలీజ్ కాబోతున్న రుద్రుడు సినిమా స్టోరీని ఈరోజే చెప్పేస్తే ఎలా ఉంటుంది? హీరో లారెన్స్ అదే పని చేశాడు.

Advertisement
Update: 2023-04-13 12:59 GMT

యాక్టర్, కొరియోగ్రాఫర్, ఫిలల్మ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా, కతిరేసన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ రుద్రుడు. తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ సినిమా. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు.

ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై, తరికేశన్ సమర్పకుడిగా వస్తున్న ఈ సినిమాను పిక్సెల్ స్టుడియోస్ బ్యానర్ పై ఠాగూర్ మధు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి స్టోరీ మొత్తం చెప్పేశాడు లారెన్స్.

"రుద్రుడు సినిమాలో ఓ కామన్ మేన్ గా కనిపిస్తాను. అతడి జీవితంలో ఓ సమస్య తలెత్తుతుంది. ఇది సహజంగానే జరిగిందని భావిస్తున్న సమయంలో, ఎవరో కావాలనే చేశారనే విషయం అతడికి తెలుస్తుంది. అలాంటి సమయంలో ఆ సామాన్యుడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేది నా పాత్ర. సామాన్యంగా నేను చేసే పాత్రల్లో మాస్ ఉంటుంది. కానీ ఇందులో నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే మిడిల్ క్లాస్ మనిషిగా కనిపిస్తాను. అలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిని పరిస్థితులు ఎలా మార్చేశాయి, అతడు ఎలా మారాడు అనేది రుద్రుడు స్టోరీ."

కాంచన, ముని సినిమాల్లో ఉన్న థ్రిల్, రుద్రుడు సినిమాలో కూడా ఉంటుందని, అయితే అది వేరే విధంగా ఉంటుందని చెబుతున్నాడు లారెన్స్. తల్లి సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కిందనే విషయాన్ని తెలిపిన లారెన్స్.. ఇందులో సెంటిమెంట్ తో పాటు తననుంచి ప్రేక్షకులు ఆశించే డాన్స్, కామెడీ అన్నీ ఉన్నాయంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News