Puri Jagannadh: చిరంజీవి కోసం కథ రాస్తున్న పూరి

Puri Jagannadh: చిరంజీవి కోసం మరోసారి కథ రెడీ చేస్తున్నాడు పూరి జగన్నాధ్. ఈసారి ఆటో జానీ ప్రాజెక్టు కాదు. పూర్తిగా కొత్త కథ అని టాక్.

Advertisement
Update: 2022-12-20 06:30 GMT

దర్శకుడు పూరి జగన్నాధ్

ఓ సరికొత్త కాంబినేషన్ కు తెరవెనక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కథను సిద్ధం చేసే పనిలో పూరి జగన్నాధ్ బిజీగా ఉన్నాడు. తన టీమ్ తో కలిసి గోవా వెళ్లిన పూరి, అక్కడే చిరంజీవి సినిమా కథపై కసరత్తులు చేస్తున్నాడు.

నిజానికి చిరంజీవి రీఎంట్రీ సినిమాను పూరి జగన్నాధ్ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆటో జానీ అనే కథను కూడా సిద్ధం చేశాడు పూరి. కానీ ఆ స్టోరీ సెకండాఫ్ చిరుకు నచ్చక పక్కనపెట్టేశాడు. అప్పట్నుంచి చిరు-పూరి కాంబినేషన్ వార్తల్లో నలుగుతూనే ఉంది.

మళ్లీ ఇన్నాళ్లకు మెగా కాంపౌండ్ నుంచి పూరికి పిలుపొచ్చింది. చిరంజీవి కోసం ఓ మంచి కథ సిద్ధం చేయమని, స్వయంగా రామ్ చరణ్, పూరి జగన్నాధ్ కు ఆఫర్ ఇచ్చాడట. దీంతో ప్రస్తుతం పూరి ఆ పనిలో బిజీగా ఉన్నాడు.

అయితే ప్రస్తుతానికి కథ ఓకే చేసుకోవడం వరకు మాత్రమే ఈ ప్రాజెక్టు ఉంటుంది. కథ ఓకే అయిన తర్వాత, అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం అంటున్నారు. ఎందుకంటే, చిరంజీవి చేతిలో ఇంకో 2 సినిమాలున్నాయి. అటు పూరి జగన్నాధ్ కూడా బాలయ్యతో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News