Prithviraj | అవకాశం వస్తే ప్రభాస్ తో సినిమా

Prithviraj - సలార్ లో ప్రభాస్ తో కలిసి నటిస్తున్నాడు ఫృధ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడీ నటుడు, అవకాశం వస్తే ప్రభాస్ ను డైరక్ట్ చేస్తానంటున్నాడు.

Advertisement
Update: 2024-03-26 01:09 GMT

సలార్ సినిమాతో ఫృధ్వీరాజ్ సుకుమారన్ కు ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు. అతడే ప్రభాస్. సలార్ సినిమా టైమ్ లోనే ప్రభాస్ ను కలిసిన ఫృధ్వీరాజ్, అతడి మంచి మనసుకు, ఆతిధ్యానికి పులకరించిపోయాడు. ఒక దశలో ఏకంగా తన రేంజ్ రోవర్ కారు వాడుకోమని ప్రభాస్ ఆఫర్ చేయడంతో ఫృధ్వీరాజ్ షాక్ అయ్యాడు. తన కోసం ప్రతి రోజూ భోజనం పంపించేవాడని, చాలా సరదాగా ఉంటాడని ప్రభాస్ ను మెచ్చుకున్నాడు.


మరి ఇలాంటి వ్యక్తికి తెలుగులో డైరక్షన్ చేసే అవకాశం వస్తే? సరిగ్గా ఇదే ప్రశ్న ఫృధ్వీరాజ్ కు ఎదురైంది. దీనికి అతడు తడుముకోకుండా ప్రభాస్ పేరు చెప్పాడు. తెలుగులో తనను ఎవరైనా మంచి కథతో సంప్రదిస్తే, అందులో హీరోగా నటిస్తానని.. ఒకవేళ తనే డైరక్ట్ చేయాల్సి వస్తే, ప్రభాస్ ను డైరక్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు పృధ్వీరాజ్.


సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు పృధ్వీరాజ్. ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ప్రభాస్ తో ఎక్కువగా సమయం గడిపే అవకాశం తనకు దక్కిందని, తన జీవితంలో తను సంపాదించుకున్న అతికొద్ది మంది బెస్ట్ ఫ్రెండ్స్ లో ప్రభాస్ ఒకడని తెలిపాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు, కొన్నిసార్లు ప్రభాస్ కు కాల్ చేయకపోయినా, తను వచ్చిన విషయం తెలుసుకొని, ప్రభాస్ తనకు కాల్ చేసి ఇంటికి ఆహ్వానిస్తాడని, తనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తాడని తెలిపాడు పృధ్వీరాజ్.


తన ఫ్రెండ్ ను డైరక్ట్ చేసే అవకాశం వస్తే, అది తన అదృష్టంగా భావిస్తానన్నాడు. మలయాళంలో గాడ్ ఫాదర్ సినిమాను తీశాడు పృధ్వీరాజ్. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు పృధ్వీరాజ్. ఆ తర్వాత బ్రో డాడీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. త్వరలోనే ప్రభాస్ తో కలిసి సలార్-2 సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు ఈ హీరో.

Tags:    
Advertisement

Similar News