'ఘోస్ట్' వెనక మీనింగ్ బయటపెట్టిన దర్శకుడు

నాగార్జున లాంటి హీరో నటించిన సినిమాకు ఘోస్ట్ అనే నెగెటివ్ టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ టైటిల్ వెనక సీక్రెట్ ఏంటి.. స్వయంగా దర్శకుడు దీనిపై క్లారిటీ ఇచ్చాడు

Advertisement
Update: 2022-10-01 13:27 GMT

దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది ది ఘోస్ట్ సినిమా. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఇంతకీ ఈ యాక్షన్ సినిమాకు ఘోస్ట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు.. ఆ పదం వెనక అర్థం ఏంటి? దీనిపై స్వయంగా దర్శకుడు స్పష్టత ఇచ్చాడు.

"ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పదం. రీసెర్ట్ ఎనాలసిస్ వింగ్ (రా), ఇంటల్జెన్స్ ఫీల్డ్ లో ఈ పదానికి ఒక పవర్ ఉంది. ఘోస్ట్ ప్రోటోకాల్ అని అంటారు. ఇందులో హీరో కోడ్ ఘోస్ట్. అండర్ వరల్డ్ అతనికి పెట్టిన పేరు ఘోస్ట్."

ఇలా ఘోస్ట్ టైటిల్ వెనక అర్థాన్ని వివరించాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గరుడవేగ సినిమాతో పోలిస్తే, ఇది మరింత పెద్ద యాక్షన్ సినిమా అంటున్నాడు ప్రవీణ్. ఘోస్ట్ సినిమాలో ఏకంగా 12 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని, దేనికదే కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు. 

Tags:    
Advertisement

Similar News