Jai Hanuman | ప్రశాంత్ వర్మ నుంచి మరో పోస్టర్

Jai Hanuman - హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజైంది.

Advertisement
Update: 2024-04-23 17:29 GMT

పాన్ ఇండియా సంచలనం 'హను-మాన్' తర్వాత ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నాడు.

'జై హనుమాన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హను-మాన్‌కి సీక్వెల్. ఇది ప్రీక్వెల్ ముగింపులో అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ చేశారు. సినిమా పెద్ద కాన్వాస్‌పై రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన దర్శకుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు. పోస్టర్‌లో లార్డ్ హనుమాన్ కొండపై చేతిలో గదతో నిలబడి ఉన్నారు. హనుమ ను సమీపించే డ్రాగన్ అగ్నిని వదులుతోంది.

డ్రాగన్‌లను తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నాడు ప్రశాంత్ వర్మ. టాప్-ఎండ్ గ్రాఫిక్స్, ఇతర సాంకేతికతలతో మనం ఎలాంటి అనుభవాన్ని పొందబోతున్నామో పోస్టర్ ద్వారా పరోక్షంగా చెబుతున్నాడు.

జై హనుమాన్ సినిమా ఐమ్యాక్స్ త్రీడీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా వంద రోజుల వేడుకల్ని నిర్వహించారు. 

Tags:    
Advertisement

Similar News