Prabhas - మరో మూవీకి ఓకే చెప్పిన ప్రభాస్?

Prabhas Hanu Raghavapudi - హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తాడట ప్రభాస్. ప్రస్తతానికైతే ఇది రూమర్ మాత్రమే.

Advertisement
Update: 2023-05-19 11:01 GMT

ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అతడు నటించిన ఆదిపురుష్ సినిమా వచ్చేనెల రిలీజ్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా సెట్స్ పై ఉంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె కూడా సెట్స్ పై ఉంది. ఇవి కాకుండా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా చేయాల్సి ఉంది. 


ఓవైపు ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉండగా, మరోవైపు కొత్త సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. హను రాఘవపూడి చెప్పిన స్టోరీ, ప్రభాస్ కు విపరీతంగా నచ్చిందంట. ఆ స్టోరీకి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 


సీతారామం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు హను రాఘవపూడి. ఇంతకుముందు కూడా మంచి సినిమాలు తీసినప్పటికీ, సీతారామంతో అతడికి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను ప్రభాస్ తో కలిసి డబుల్ చేసుకునే పనిలో పడ్డాడు ఈ దర్శకుడు. 


అయితే ప్రభాస్ ఇప్పుడు ఆదిపురుష్ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మైథలాజికల్ మూవీ కూడా కావడంతో, ఆ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆదిపురుష్ రిలీజ్ తర్వాత, హను రాఘవపూడితో చేయాల్సిన సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.

Tags:    
Advertisement

Similar News