Salaar | సలార్ లేటెస్ట్ కలెక్షన్

Salaar Movie - ప్రభాస్ మూవీ దుమ్ముదులుపుతోంది. మరీ ముఖ్యంగా న్యూ ఇయర్ వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించింది సలార్.

Advertisement
Update: 2024-01-02 17:06 GMT

సలార్ సినిమా కళ్లుచెదిరే వసూళ్లు సాధిస్తోంది. నిజానికి 2వ వారాంతం ఈ సినిమా ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. ఎప్పుడైతే న్యూ ఇయర్ తో పాటు వీకెండ్ వచ్చిందో, సలార్ మెరిసింది. భారీ జంప్ కనిపించింది. అంచనాల కంటే మెరుగ్గా ట్రెండ్ అయి, టోటల్ వసూళ్లను కవర్ చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ షేర్ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు దాటింది. బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సలార్ దే మూడో స్థానం.

సలార్ నైజాం, ఓవర్సీస్‌లో అనూహ్యంగా పుంజుకుంది. ఇది ఇప్పటివరకు సీడెడ్‌లో మంచి రన్‌ను కలిగి ఉన్నప్పటికీ, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే బ్రేక్-ఈవెన్ పై అనుమానాలున్నాయి. చూడ్డానికి నంబర్స్ బాగున్నప్పటికీ, భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ కారణంగా, ఈ సినిమా రెవెన్యూ తక్కువగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో భారీగా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లేదు. సలార్ సినిమాకు కేవలం 40 రూపాయల పెంపు మాత్రమే ఇచ్చారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూసినప్పుడు ఇది చాలా తక్కువ.

ఓవరాల్‌గా, తెలుగు వెర్షన్‌ వరల్డ్ వైడ్ బ్రేక్‌ఈవెన్ అవ్వాలంటే ఇంకా 150 కోట్లు షేర్ కావాలి. ఇప్పటివరకు 82 శాతం రికవరీ అయింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో సలార్ మరో 10 రోజుల పాటు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News