Kalki Movie | భైరవ్ గా ప్రభాస్

Kalki Movie - ప్రభాస్ నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా నుంచి మరో పోస్టర్ వచ్చింది. ప్రభాస్ పాత్ర పేరును కూడా బయటపెట్టారు.

Advertisement
Update: 2024-03-08 17:27 GMT

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ ‘కల్కి 2898 AD’. మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును 'భైరవ'గా పరిచయం చేశారు మేకర్స్.

టీమ్ సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. “భవిష్యత్తుకు చెందిన కాశీ వీధుల నుంచి భైరవ ని పరిచయం చేస్తున్నాం'' అంటూ కొటేషన్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాకు కాశీకి లింక్ ఉందనే విషయం బయటపడింది.

ప్రభాస్ దృఢమైన శరీరాకృతితో కాల భైరవ లా విధ్వంసకరంగా కనిపిస్తుండగా, బ్యాగ్ గ్రౌండ్ లో భవిష్యత్తు కాశీ కనిపిస్తోంది. ఆధ్యాత్మిక భూమిని అటువంటి స్థితిలో చూడటం ఆశ్చర్యంగా ఉంది. ప్రభాస్ పోనీటైల్ తో కనిపించాడు. అతని డ్రెస్సింగ్ స్టైల్ బాగా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. దుస్తుల లోపల కవచం ఉంది.

కల్కి కథ క్రీస్తు పూర్వానికి చెందిన మహాభారత పురాణ సంఘటనల నుండి 2898 సంవత్సరం వరకు కొనసాగుతుంది. దాదాపు 6000 సంవత్సరాల నిడివి కలిగిన కథ ఇది.

వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అద్భుతమైన ప్రదేశాలలో ప్రభాస్, దిశా పటానీలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.




Tags:    
Advertisement

Similar News