Pooja Hegde | లంగా వోణీలో బుట్టబొమ్మ

Pooja Hegde - వరుస ఫొటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది పూజా హెగ్డే. తాజాగా ఆమె పూర్తి సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ, ఓ ఫొటో షూట్ చేసింది.

Advertisement
Update: 2024-01-23 16:53 GMT

పూజా హెగ్డే నుంచి ఫొటో షూట్స్ కొత్త కాదు. కాకపోతే ఆమె ఎక్కువగా తన అల్ట్రా గ్లామరస్ లుక్స్ తోనే ఆకర్షించింది. అాలాంటి హీరోయిన్ నుంచి అచ్చమైన తెలుగమ్మాయి లుక్స్ వస్తే ఎలా ఉంటుంది? దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ ఫొటోలు.

అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తోంది పూజా హెగ్డే. లాంగావోణి ధరించి, స్వచ్ఛమైన చిరునవ్వుతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. పూజా పాప నుంచి ఇలాంటి ఫొటోషూట్ మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఈ స్టిల్స్ వైరల్ అయ్యాయి.

నో ఫిల్టర్ సెగ్మెంట్ లో భాగంగా అప్పుడప్పుడు మేకప్ లేకుండా ఫొటోలు విడుదల చేయడం పూజాహెగ్డేకు అలవాటు. తాజాగా ఈమధ్య అలాంటిదే ఓ ఫొటో విడుదల చేసిన ఈ హీరోయిన్, త్వరలోనే ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తానని అప్పుడే తెలిపింది. అన్నట్టుగానే ఇలా అచ్చమైన ఆంధ్రా పిల్లలా కనిపించి మెరిపించింది.


సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా ఉంది. అది కూడా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.. త్వరలోనే ఆమె ఓటీటీ కోసం ఓ సినిమాలో నటించనుంది. అది కాస్త బోల్డ్ గా ఉండబోతోంది.






Tags:    
Advertisement

Similar News