Ustad Bhagat Singh - సెట్స్ పైకి పవన్ కొత్త సినిమా

Pawan starts Ustad Bhagat Singh Movie regular shooting - పవన్ మరో సినిమా స్టార్ట్ చేశాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వచ్చింది.

Advertisement
Update: 2023-04-06 05:04 GMT

గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం గత డిసెంబర్ లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. బుధవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్ లో మొదటి షెడ్యూల్ మొదలైంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క 'గబ్బర్ సింగ్' సినిమానే అయినప్పటికీ.. ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం కారణంగా వీరి కలయికలో వస్తున్న రెండో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్ ను తీస్తానంటున్నాడు హరీష్ శంకర్.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 'గబ్బర్ సింగ్' కు కూడా ఇతడే మ్యూజిక్ డైరక్టర్. ప్రొడక్షన్ డిజైనర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా ఛోటా కె.ప్రసాద్ పని చేస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News