BRO Teaser | రేపే పవన్ కల్యాణ్ బ్రో మూవీ టీజర్ రిలీజ్

Pawan Kalyan's BRO Teaser | పవన్ కల్యాణ్ తాజా చిత్రం బ్రో. ఈ సినిమా టీజర్ రేపు రిలీజ్ అవుతోంది.

Advertisement
Update: 2023-06-28 12:48 GMT

BRO Teaser | రేపే పవన్ కల్యాణ్ మూవీ టీజర్ రిలీజ్

BRO Teaser | వరుస రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అతను చేస్తున్న వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే జ్వరంలో కూడా ఆయన తన సినిమా పనుల్ని పూర్తి చేస్తున్నారు. తాజా చిత్రం బ్రో కోసం డబ్బింగ్ చెప్పారు.

పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా టీజర్ రెడీ అయింది. పవన్ డబ్బింగ్ చెబితే సరిపోతుంది. కానీ పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ, టీజర్ లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో డబ్బింగ్ చెప్పారు. దీని కోసం హైదరాబాద్ నుంచి భీమవరానికి డబ్బింగ్ ఎక్విప్ మెంట్ తీసుకెళ్లారు.

ఇంట్లోనే జ్వరంతో ఇబ్బంది పడుతూ కూడా.. బ్రో సినిమా టీజర్ కు డబ్బింగ్ పూర్తిచేశారు పవన్. దీంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు బ్రో టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

వచ్చే నెల 28న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News