Pawan Kalyan: చెప్పినట్టుగానే సినిమా స్టార్ట్ చేసిన పవన్

చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పవన్ కల్యాణ్ స్టార్ట్ చేశారు. సినిమా పూర్తయ్యేంతవరకు దీనిపైనే ఫోకస్ పెడుతున్నారు

Advertisement
Update: 2022-11-01 15:06 GMT

చెప్పినట్టుగానే పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. హరిహర వీరమల్లు షూటింగ్ లో ఈరోజు జాయిన్ అయ్యారు పవన్. ఇకపై ఈ సినిమాకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది హరిహర వీరమల్లు సినిమా. ఇటు సినిమాలతో పాటు, అటు రాజకీయాలు కూడా చూసుకోవాల్సి రావడంతో, ఎప్పటికప్పుడు ఈ సినిమా షూట్ ను పవన్ వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం హరిహర వీరమల్లు కంప్లీట్ చేసేందుకు రెడీ అయ్యారు.

టోటల్ సినిమా పూర్తయ్యేంతవరకు మరో సినిమా గురించి ఆలోచించకూడదని నిర్ణయించుకున్నారట పవన్. అయితే ఈ నెలాఖరు నుంచి ఆయన మరో రీమేక్ స్టార్ట్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరి పవన్ ఒకే సినిమాకు ఫిక్స్ అవుతారా లేక ఇంకో సినిమా కూడా స్టార్ట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News