Pawan Kalyan: కొత్త సినిమా ప్రారంభించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan, Hrish Shankar: ఎట్టకేలకు ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వస్తోంది. ఈరోజు సినిమా లాంఛనంగా మొదలైంది. పేరు ఉస్తాద్ భగత్ సింగ్

Advertisement
Update: 2022-12-11 10:54 GMT

'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ అందుకొని సంచలనం సృష్టించిన పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో మరోసారి కలిసింది. వీరి కలయికలో రానున్న రెండో చిత్రానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ కూడా వచ్చాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి. వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు.

దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు.

చిత్ర ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెల్లటి ఓవర్‌కోట్‌ ధరించి, హార్లే డేవిడ్‌సన్ బైక్‌ పక్కన, టీ గ్లాస్ పట్టుకుని నిల్చొని ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో 'ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు', 'మనల్ని ఎవడ్రా ఆపేది' అనే క్యాప్షన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

గతంలో హరీష్ శంకర్ తో 'దువ్వాడ జగన్నాథం' చిత్రానికి పని చేసిన అయానంక బోస్, ఈ కొత్త సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 

Tags:    
Advertisement

Similar News