Operation Valentine | ఆపరేషన్ వాలంటైన్ సాంగ్ రిలీజ్

Operation Valentine - వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలంటైన్ నుంచి సెకెండ్ సింగిల్ ను విడుదల చేశారు.

Advertisement
Update: 2024-02-07 01:28 GMT

వరుణ్ తేజ్ నటిస్తున్న తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ను చూపించడానికి, మేకర్స్ రెండో సింగిల్ ను విడుదల చేశారు.

ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని అందించాడు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్ ఆకట్టుకునేలా పాడారు.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో స్వయంగా హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. పాట కంటే సినిమా మరో స్థాయిలో ఉంటుందని అన్నాడు వరుణ్ తేజ్. దేశాన్ని కాపాడే సైనికుడు 130కోట్ల మందిని తన కుటుంబంగా భావించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడని.. అలాంటి సైనికుడి త్యాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో 'ఆపరేషన్ వాలెంటైన్' చేశామన్నాడు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఐఏఎఫ్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.

ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదలచేస్తారు. 

Full View

Tags:    
Advertisement

Similar News