SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్

SS Rajamouli and Mahesh Babu Movie Update: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయాలి. గుంటూరు కారం తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. తాజాగా ఈ సినిమాపై మరో రూమర్ మొదలైంది..

Advertisement
Update: 2023-06-06 11:44 GMT

SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్

మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో సినిమా రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ ఈ ప్రాజెక్టుపై పుకార్లు మాత్రం చాన్నాళ్ల కిందటే మొదలైపోయాయి. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్నటివరకు స్టోరీలైన్ పై చర్చ నడిచింది. ఇప్పుడు హీరోయిన్లు ఎవరనే అంశంపై జోరుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు-రాజమౌళి సినిమా కోసం ముందుగా జాన్వి కపూర్ ను హీరోయిన్ గా అనుకున్నారట. ఆ గాసిప్ కొన్నాళ్ల పాటు నడిచింది. ఇప్పుడు ఆమె స్థానంలో దీపిక పదుకోన్ వచ్చి చేరింది. తాజాగా ఊహాగానాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు కోసం దీపిక పదుకోన్ ను తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నారట.

అటు జాన్వి అయినా, ఇటు దీపిక అయినా టాలీవుడ్ కు కొత్త ముఖాలేం కాదు. మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ అయ్యే టైమ్ కి జాన్వి నుంచి దేవర సినిమా, దీపిక నుంచి ప్రాజెక్టు-కె సినిమాలు వచ్చేస్తాయి. సో.. వాటిలో ఏ సినిమా హిట్టయితే, ఆ హీరోయిన్ మహేష్ సినిమాలోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎడ్వెంచరస్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు కథ రాసే పనిలో రాజమౌళి, విజయేంద్రప్రసాద్ టీమ్ బిజీగా ఉన్నారు. కథ కొలిక్కి వచ్చిన వెంటనే, ప్రాజెక్టు ఎనౌన్స్ చేస్తారు.

Tags:    
Advertisement

Similar News