Om Bheem Bush | సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శ్రీవిష్ణు సినిమా

Om Bheem Bush - శ్రీవిష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ఓం భీమ్ బుష్. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

Advertisement
Update: 2024-03-20 01:44 GMT

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా, హుషారు మూవీ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓం భీమ్ బుష్. యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ దక్కింది.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది ఓం భీమ్ బుష్. ఓవర్సీస్ లో కొన్ని ప్రాంతాలలో 21న ప్రీమియర్లు వేయబోతున్నారు.

‘ఓం భీమ్ బుష్’ పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను సమానంగా ఆకట్టుకుంటుందని చెబుతోంది యూనిట్. కాలేజ్ లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమవుతుందని, ఆ తర్వాత భైరవపురం గ్రామంలో క్రేజీ రైడ్ ఉంటుందని తెలిపింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివర్లో భారీ ఎమోషన్, ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని చెబుతోంది.

సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందంట. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్ గా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ప్రచారాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు.

Tags:    
Advertisement

Similar News