Robinhood | నితిన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Nithin's Robinhood Movie - నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేద్దాం...

Advertisement
Update: 2024-03-02 08:18 GMT

నితిన్ తాజా చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది.

రామ్-లక్ష్మణ్ మాస్టర్ల నేతృత్వంలో నితిన్ పై భారీ యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. ఇది సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్. అంతకంటే ముందు మున్నార్ లో ఈ సినిమాకు సంబంధించి భారీ షెడ్యూల్ ఒకటి పూర్తయింది.

ఇప్పటికే 2 హిట్స్ ఇచ్చాడు వెంకీ కుడుముల. గతంలో నితిన్ తో భీష్మ లాంటి హిట్ కొట్టాడు. అందుకే రాబిన్ హుడ్ పై అంచనాలు పెరిగాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఆమె ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయింది.

రీసెంట్ గా సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాడు నితిన్. అతడి తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీమేన్ డిజాస్టర్ అయింది. దీంతో రాబిన్ హుడ్ పైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ నటుడు.

Tags:    
Advertisement

Similar News